వింబుల్డన్ విజేతగా నిలిచిన సెరేనా విలియమ్స్
- July 09, 2016
సెరెనా విలియమ్స్.. ఈ ఏడాది ఎట్టకేలకు తొలి గ్రాండ్ స్లామ్ సాధించింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో.. వరుస రెండు సెట్లలో పోరును ముగించి వింబుల్డన్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ 7-5, 6-3 తేడాతో ఎంజెలిక్ కెర్బర్(జర్మనీ) పై గెలిచి వింబుల్డన్ టైటిల్ ను సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా ఆద్యంత ఆకట్టుకుని ఏడోసారి వింబుల్డన్ టైటిల్ ను ముద్దాడింది. తద్వారా జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ పేరిట ఉన్న 22 గ్రాండ్ స్లామ్ రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో కెర్బర్ చేతిలో ఓటమికి సెరెనా ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. తొలి సెట్ ఆరో గేమ్ లో కెర్బర్ సర్వీస్ ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ తరువాత తన సర్వీస్ ను కాపాడుకుని ఆ సెట్ ను దక్కించుకుంది. ఇక రెండో సెట్ లో కెర్బర్ నుంచి సెరెనా కాస్త పోటీ ఎదుర్కొంది. రెండో సెట్ లో సెరెనా 2 -1 తో ఆధిక్యంలో ఉన్న దశలో కెర్బర్ పుంజుకుంది. తన సర్వీసును కాపాడుకోవడంతో పాటు, సెరెనా సర్వీస్ ను బ్రేక్ చేయడంతో స్కోరు 3-3తో సమం చేసింది కాగా, ఆ తరువాత నాల్గో గేమ్ లో తన సర్వీసును కాపాడుకున్న సెరెనా.. ఐదో గేమ్ లో బ్రేక్ పాయింట్ ద్వారా ఆధిక్యం సాధించింది. ఇక ఆరో గేమ్ ను సెరెనా సునాయాసంగా గెలిచి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు స్టెఫీగ్రాఫ్ తర్వాత వింబుల్డన్ సాధించిన తొలి జర్మనీ క్రీడాకారిణిగా నిలవాలనుకున్న కెర్బర్ రన్నరప్ గా సరిపెట్టుకుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







