జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
- May 12, 2025
న్యూ ఢిల్లీ: పాకిస్థాన్, పీవోకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. గత నాలుగు రోజులుగా భారత సైన్య సంయమనాన్ని, సామర్థ్యాన్ని చూస్తున్నామని అన్నారు. నిఘావర్గాల సామర్థ్యాన్ని, మన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసిందని తెలిపారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బ తీసిందని అన్నారు.
మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని మోదీ చెప్పారు. మన రక్షణ దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానీకమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ మొత్తం నివ్వెరబోయిందని, అందరి హృదయాలు జ్వలించిపోయాయని తెలిపారు.
మన రక్షక దళాల వీరత్వాన్ని, ధైర్యాన్ని దేశంలోని ప్రతి తల్లికి, ప్రతి సోదరికి, ప్రతి కూతురికి అంకితం చేస్తున్నానని మోదీ చెప్పారు. మన మహిళల సిందూరాన్ని తుడిచిని వారిని బూడిద చేశామని తెలిపారు.
కుటుంబ సభ్యుల ముందే టూరిస్టులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చిచంపారని మోదీ తెలిపారు. 25 ఏళ్లుగా పాకిస్థాన్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాదుల తండాలను ఒక్కసారిగా మన సైన్యం తుడిచిపెట్టిందని చెప్పారు. మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారిని తుదముట్టించామని తెలిపారు. భారత్ దెబ్బకు పాకిస్థాన్ నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిందని చెప్పారు.
భారత్ ప్రతిచర్యలకు పాకిస్థాన్ భయపడిపోయి కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని చెప్పారు. భారత మహిళల సిందూరాన్ని తుడిచి వారికి బుద్ధి చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే పీవోకే మీదే జరుగుతాయని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు ఉన్నాయంటూ బెదిరించే ప్రయత్నాలు చేస్తూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!