కువైట్లో స్పెషల్ భద్రతా తనిఖీలు...440 మంది అరెస్ట్..!!
- May 13, 2025
కువైట్: అన్ని గవర్నరేట్లలో నిర్వహించిన విస్తృత భద్రతా తనిఖీలలో రెసిడెన్సీ, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 440 మందిని అరెస్ట్ చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఏప్రిల్ 30 నుండి మే 9 మధ్య తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నది.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ ప్రయత్నాలు చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను అరికట్టడానికి, నివాస చట్ట ఉల్లంఘనలను ట్రాక్ చేయడానికి నిర్దేశించారు. కువైట్ కార్మిక, నివాస నిబంధనలను పాటించకపోవడానికి సంబంధించిన కేసులను తగ్గించడానికి విస్తృత వ్యూహంలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అరెస్టు చేయబడిన వారందరినీ చట్టపరమైన ప్రాసెసింగ్ కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన కార్మికులు, యజమానులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అన్ని రంగాలలో భద్రతా తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







