SR180 బిలియన్లకు చేరుకున్న సౌదీ టెక్నాలజీ మార్కెట్.. 7.5% వృద్ధి రేటు..!!
- May 13, 2025
రియాద్: 2024లో కమ్యూనికేషన్స్, టెక్నాలజీ మార్కెట్ పరిమాణం SR180 బిలియన్లకు చేరుకుందని కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలలో 7.5 శాతం వార్షిక వృద్ధి రేటు ఉందని తెలిపింది. సోమవారం రియాద్‌లో జరిగిన ICT ఇండికేటర్స్ ఫోరం (2025) 11వ ఎడిషన్ సందర్భంగా యాక్టింగ్ CST గవర్నర్ ఇంజినీర్ హైతం అల్-ఓహాలి సమక్షంలో ప్రకటించారు.ఈ సందర్భంగా కమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగం ఆర్థిక పనితీరును సమీక్షించే ప్యానెల్ చర్చ జరిగింది.
CST విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. టెలికమ్యూనికేషన్స్, టెక్నాలజీ రంగానికి సంబంధించిన పనితీరు సూచికలపై CST జనరల్ మేనేజర్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇంజనీర్ థామర్ అల్ ఖ్వైటర్ అందించిన ప్రదర్శనతో ఫోరమ్ ప్రారంభమైంది. 2024లో కింగ్డమ్లో సగటు మొబైల్ ఇంటర్నెట్ వేగం 129 Mbpsకి చేరుకుందని, G20 దేశాలలో నాల్గవ స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. మొబైల్ టెలికమ్యూనికేషన్ సబ్స్క్రిప్షన్లు 68.2 మిలియన్లకు పెరిగాయని, వార్షిక వృద్ధి రేటు 7 శాతంగా ఉందని తెలిపారు. 2024లో స్పేస్ మార్కెట్ పరిమాణం సుమారు SR7.1 బిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. కింగ్డమ్లో ICT-లిస్టెడ్ కంపెనీల మొత్తం ఆస్తులు SR255 బిలియన్లకు చేరుకున్నాయని, మొత్తం ఆదాయాలు SR128 బిలియన్లు, మార్కెట్ క్యాప్ SR427 బిలియన్లు అని నివేదించారు.
"మొబైల్ కమ్యూనికేషన్స్: రియలిస్టిక్ ఇండికేటర్స్ అండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇన్సైట్స్" అనే మరో ప్రెజెంటేషన్‌లో GSMAలోని MENA పాలసీ డైరెక్టర్ అమర్ హషేమ్ మొబైల్ కనెక్టివిటీలో సౌదీ అరేబియా ముందుచూపు, 5G విస్తరణను వేగవంతం చేయడంలో సాధించిన గణనీయమైన పురోగతిని వెల్లడించారు.
చివరగా సౌదీ అరేబియా ఇంటర్నెట్ వినియోగం, వృద్ధిని ప్రస్తావించే "సౌదీ ఇంటర్నెట్ నివేదిక 2024" నాల్గవ ఎడిషన్‌ను CST డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ ముసాబ్ అలమ్మర్ ఆవిష్కరించారు. ఈ నివేదిక వ్యక్తిగత డేటా వినియోగ రేట్లతో పాటు ఎక్కువగా ఉపయోగించిన, డౌన్లోడ్ చేయబడిన అప్లికేషన్లను సమీక్షించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







