నర్సులకు గోల్డెన్ వీసా ప్రకటించిన షేక్ హమ్దాన్..!!

- May 13, 2025 , by Maagulf
నర్సులకు గోల్డెన్ వీసా ప్రకటించిన షేక్ హమ్దాన్..!!

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, యూఏఈ రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు దుబాయ్ హెల్త్‌లో పనిచేస్తున్న నర్సులకు దుబాయ్ ఇప్పుడు గోల్డెన్ వీసాలను అందించనుంది. సోమవారం ఈ మేరకు ప్రకటించారు. సమాజానికి వారి అమూల్యమైన సహకారాన్ని, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను అభివృద్ధి చేయడంలో వారి కీలక పాత్రను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

నర్సింగ్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ముందంజలో ఉన్నారని, ఆరోగ్యకరమైన సమాజం,మెరుగైన జీవన నాణ్యత దార్శనికతను గ్రహించడంలో ముఖ్యమైన భాగస్వాములుగా పనిచేస్తారని క్రౌన్ ప్రిన్స్ ప్రశసించారు.   

ప్రతి సంవత్సరం మే 12న జరుపుకునే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణులకు మద్దతు ఇవ్వడంతోపాటు సమాజానికి సేవ చేయడం కొనసాగించడానికి వారికి శక్తినిచ్చే వాతావరణాన్ని పెంపొందించడంలో నాయకత్వం నిరంతర నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు.

2021 నవంబర్‌లో ఫ్రంట్‌లైన్ కార్మికులు, వారి కుటుంబాలకు గోల్డెన్ వీసాలు మంజూరు చేయాలని యేఏఈ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో దుబాయ్ కూడా అత్యుత్తమ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలను ప్రకటించింది. అక్టోబర్ 5, 2024న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా షేక్ హమ్దాన్ ఈ ప్రకటన చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com