తలకోనలో సినిమా షూటింగ్‌..

- July 09, 2016 , by Maagulf
తలకోనలో సినిమా షూటింగ్‌..

ప్రముఖ పర్యాటక కేంద్రం తలకోనలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయకుమార్‌లు నటిస్తున్న చిత్రం చిత్రీకరణ ప్రారంభమైంది. దీన్ని తమిళం తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన రాత్రి వేళ అటవీ ప్రాంతంలో సన్నివేశాలను చిత్రీకరించేందుకు 300 మంది సభ్యులున్న యూనిట్‌ చెన్నై, ముంబయి నుంచి తరలివచ్చింది. రెండు రోజుల పాటు పూర్తిగా రాత్రి సమయంలోనే దట్టమైన అడవిలో చిత్రీకరించారు. ఇతరులు ఎవ్వరినీ చిత్రీకరిస్తున్న ప్రాంతానికి అనుమతించడంలేదు. చిత్రంలోని కీలక ఘట్టాలను ఇక్కడ తీస్తున్నట్లు తెలుస్తుంది. చిత్రం విశేషాలను తెలియజేసేందుకు చిత్ర నిర్మాతలు, యూనిట్‌ సభ్యులు అంగీకరించలేదు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తలకోనలో సినిమా షూటింగ్‌ జరగడం విశేషం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com