''స్పీల్‌బర్గ్ సినిమాలో భాగం కావడం గొప్ప అవకాశం : జగపతిబాబు
- July 09, 2016
హా లీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన చిత్రానికి గాత్రదానం చేయడం నాకు దక్కిన ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు ప్రముఖ నటుడు జగపతిబాబు. స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన చిత్రం 'ది బీఎఫ్‌జీ'. డిస్నీ, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులోని జెయింట్ పాత్రకు తెలుగులో నటుడు జగపతిబాబు గాత్రమందించారు. ఆ పాత్రకి తమిళంలో నాజర్, హిందీలో అమితాబ్ బచ్చన్ గాత్రం అందించారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగపతిబాబు మాట్లాడుతూ ''స్పీల్‌బర్గ్ సినిమాలో భాగం కావడం గొప్ప అవకాశంగా, ఓ సవాల్‌గా భావించి డబ్బింగ్ చెప్పా. కెరీర్ ఆరంభంలో నా పాత్రకి వేరొకరు గాత్రం అందించేవారు. ఇప్పుడు నేనే మరొక సినిమాకి గాత్రమందిస్తుండడం ఒక కొత్త అనుభూతినిస్తోంది. డబ్బింగ్ చెప్పాక నా గొంతు విని నేనే ఆశ్చర్యపోయా. నాకు మంచి గాత్రముందని గుర్తించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ. 'గాయం' నుంచి నాకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టా'' అన్నారు. రిలయన్స్ ప్రతినిధుల్లో ఒకరైన శ్రీధర్ చెబుతూ ''ఈ పాత్రకి తెలుగులో జగపతిబాబుగారి గొంతు సరిపోతుందని అనుకున్నాం. ఆయన పాత్రకి తగ్గట్టు గాత్రదానం చేశారు'' అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







