తలకోనలో సినిమా షూటింగ్..
- July 09, 2016
ప్రముఖ పర్యాటక కేంద్రం తలకోనలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయకుమార్లు నటిస్తున్న చిత్రం చిత్రీకరణ ప్రారంభమైంది. దీన్ని తమిళం తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి సంబంధించిన రాత్రి వేళ అటవీ ప్రాంతంలో సన్నివేశాలను చిత్రీకరించేందుకు 300 మంది సభ్యులున్న యూనిట్ చెన్నై, ముంబయి నుంచి తరలివచ్చింది. రెండు రోజుల పాటు పూర్తిగా రాత్రి సమయంలోనే దట్టమైన అడవిలో చిత్రీకరించారు. ఇతరులు ఎవ్వరినీ చిత్రీకరిస్తున్న ప్రాంతానికి అనుమతించడంలేదు. చిత్రంలోని కీలక ఘట్టాలను ఇక్కడ తీస్తున్నట్లు తెలుస్తుంది. చిత్రం విశేషాలను తెలియజేసేందుకు చిత్ర నిర్మాతలు, యూనిట్ సభ్యులు అంగీకరించలేదు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత తలకోనలో సినిమా షూటింగ్ జరగడం విశేషం
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







