'సహెల్' యాప్ ద్వారా స్కామ్ కాల్స్‌.. రిపోర్ట్ చేయాలని CITRA పిలుపు..!!

- May 15, 2025 , by Maagulf
\'సహెల్\' యాప్ ద్వారా స్కామ్ కాల్స్‌.. రిపోర్ట్ చేయాలని CITRA పిలుపు..!!

కువైట్: కువైట్‌లో "సహెల్" అప్లికేషన్ ద్వారా స్కామ్ కాల్స్ పెరగడంపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (CITRA) ఆందోళన వ్యక్తం చేసింది. ఏవైనా మోసపూరిత కాల్స్ లేదా టెక్స్ట్ సందేశాలను చూడగానే వెంటనే నివేదించాలని పిలుపునిచ్చింది. సైబర్ భద్రతను పెంచడానికి,  వినియోగదారుల వ్యక్తిగత డేటాను డిజిటల్ మోసాల నుండి రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది భాగమని CITRA వెల్లడించింది.

స్కామ్‌లను రిపోర్ట్ చేయడం ద్వారా వాటి మూలాలను గుర్తించడంలో సహాయపడుతుందని తెలిపింది. అధికారులు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని CITRA స్పష్టం చేసింది. అనుమానాస్పద సందేశాలకు ప్రతిస్పందించవద్దని లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచించారు.  దేశంలో సురక్షితమైన డిజిటల్ వాతావరణానికి మద్దతు ఇవ్వడానికి యాప్ ద్వారా వెంటనే రిపోర్ట్ చేయాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com