వరుసగా ఐదో సారి లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపీ బాలశౌరి

- May 15, 2025 , by Maagulf
వరుసగా ఐదో సారి లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపీ బాలశౌరి
న్యూ ఢిల్లీ: గత ప్రభుత్వ హయంలో నాలుగు సంవత్సరాలు లోక్ సభ సభార్దినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా పదవీ భాద్యతలు నిర్వహించిన  మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి, కూటమి ప్రభుత్వంలో మరోసారి కూడా చైర్మన్ పదవి వరించింది.లోక్ సభ సభార్దినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంతో సమర్ధవంతంగా పదవి బాధ్యతలు నిర్వహించి, అటు ఉన్నతాధికారులతోనూ, ఇటు కేంద్రం ప్రభుత్వంలోని పెద్దలతోను సత్సంభందాలు నెలకొల్పడంలో చూపించిన చాకచక్యం వారికీ మరోసారి ఈ చైర్మన్ పదవి దక్కేటట్లు చేసింది.గతంలో లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా ఎంపీ బాలశౌరి ఖాతాలో ఉండటం గమనార్హం. 
 
గత పదవీ కాలంలో 38 రకాల వివిధ సంస్థలతో సుమారుగా 80 పైగా సమావేశాలను నిర్వహించి వారి సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఎంతో ఓర్పుతో, నేర్పుతో, కమిటీలో  అందరి సభ్యుల సహకారం తీసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలతో  ఎన్నో సమావేశాలు నిర్వహించి, అక్కడి సమస్యలను కూలంకషంగా అర్ధం చేసుకొని, తగిన పరిష్కార మార్గాలు వెదకడంలో ఎంతో ప్రతిభ కనపరచడం వలననే, మరొకమారు కూటమి ప్రభుత్వంలో అదే అధ్యక్ష పదవి వరించడం జరిగింది.
 
మూడుసార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికైన ఎంపీ బాలశౌరి యొక్క సేవలను గుర్తించిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోక సభ ఫ్లోర్ లీడర్ గా నియమించడమే కాకుండా, ఇంకోసారి లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు, ఇందుకు సహకారం అందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు, కూటమి పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. 
 
ఈ పదవీకాలంలో కుడా  కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనమేర శక్తివంచన లేకుండా పాటుపడతానని, కమిటీలోని అందరు గౌరవ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని, వారి  యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com