ఇండో-పసిఫిక్ లో ఒక తెలుగు సాహస యాత్ర

- May 17, 2025 , by Maagulf
ఇండో-పసిఫిక్ లో ఒక తెలుగు సాహస యాత్ర

ఆంధ్రుల గొప్ప నౌకాయాన వారసత్వం మరియు సముద్ర ప్రయాణ సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఇద్దరు వెటరన్‌లు మరియు సీనియర్ సిటిజన్లు అయిన కర్నల్ కె. శ్రీనివాస్ (రిటైర్డ్) (ఎక్స్ EME) మరియు కెప్టెన్ CDNV ప్రసాద్ (ఇండియన్ నేవీ, రిటైర్డ్), ఇద్దరూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (1980) 63వ కోర్సు నుంచి పాసయ్యారు, న్యూజిలాండ్‌లోని ఓపువా బే నుండి 2025 మే 24వ తేదీ ఉదయం 10:00 గంటలకు (టైమ్ జోన్ -12) ఫిజీలోని సవూసవు వైపు టిస్టి అనే పడవలో ప్రయాణం మొదలుపెట్టారు. ఆ పడవ ప్రస్తుతానికి పోలాండ్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉంది, కానీ విశాఖపటణానికి వచ్చిన తర్వాత భారతీయ రిజిస్ట్రేషన్ తీసుకుని 'విశాఖ' గా మారుతుంది (విశాఖపట్నం  నౌకాశ్రయాన్ని గౌరవించేందుకు).

ఈ ఇద్దరూ తెలుగు ప్రాంతానికి చెందినవారు మరియు ప్రఖ్యాత సైనిక్ స్కూల్ కోరుకొండ 1971 ప్రవేశ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు. గత 63 సంవత్సరాల్లో ఈ పాఠశాల జాతీయ రక్షణ అకాడమీ మరియు ఇతర రక్షణ శిక్షణ సంస్థలకు విద్యార్థులను అందించడం ద్వారా ఎంతో సేవ చేసింది. గల్వాన్ లోయలో వీర మరణం పొందిన లెజెండరీ కర్నల్ సంతోష్ బాబు, MVC కూడా ఈ పాఠశాల విద్యార్థే.

గాలి మరియు వాతావరణ పరిస్థితులను బట్టి, వీరు 12 నుండి 13 రోజులలో సవూసవవు (ఫిజీ) చేరుకుంటారు. వారి ప్రయాణ ప్రణాళికలో సందర్శించే పోర్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయి-సవూసవౌవు (ఫిజీ), పోర్ట్ విలా (వనువాటు),  సొలమన్ దీవులు, కుపాంగ్ (ఇండోనేసియా), బాలీ (ఇండోనేసియా), పెనాంగ్ (మలేసియా), లాంకావి (మలేసియా), ఫుకెట్ (థాయిలాండ్), మరియు శ్రీ విజయ పురం.ఈ పోర్టులన్నింటిలోనూ వారికి తెలుగు ప్రవాసులు లేదా భారతదేశానికి చెందినవారు ఎదురయ్యే అవకాశముంది.

ఇది భారతీయ సీనియర్ సిటిజన్లు చేపడుతున్న అద్భుతమైన సముద్రయాత్ర. ఇది ఒక తరం తరువాత వాళ్ల మనవళ్ల జీవితాలలో మాత్రమే గడుపుతూ ఉన్న సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ అవుతుంది. యువతతో పాటు వృద్ధులకూ సముద్రాన్ని చేరుకునేందుకు ఇది ప్రేరణనిస్తుంది.

ఆంధ్ర కోస్తా ప్రాంతం చిన్న మరియు పెద్ద పోర్టులతో, బీచులుతో మరియు తీరం గ్రామాలతో నిండిఉంది, ఇది సముద్ర పర్యాటకానికి మరియు బ్లూ ఎకానమీకి మంచి అవకాశాలు కలిగివుంది. 2018లో విశాఖపట్నంలో వాటర్ స్పోర్ట్స్ ఇనిషియేటివ్‌ను ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలను గుర్తుచేసుకోవచ్చు. ఇప్పుడు  టిస్టి (విశాఖ) వచ్చేందుకు ఇవే ఉత్సాహాన్నిస్తాయి. దీని ద్వారా విశాఖలో ఒక మెరీనా నిర్మాణానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com