ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం: సీఎం చంద్రబాబు
- May 17, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
అంతేకాదు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపజేస్తామన్నారు. రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తామని ప్రకటించారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్ తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు.
ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచం మెచ్చుకునేలా యోగా డే నిర్వహిస్తామని అన్నారు.
అంతకు ముందు కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు ఆయన వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువులను తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారీని పరిశీలించారు.
“రైతు బజార్ ను 1999 లో పెట్టాను. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి. వినియోగదారులకు మంచి కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో పెట్టాం.125 రైతు బజార్లు ఉన్నాయి. రైతు బజార్ ను ఆదర్శంగా తీర్చిద్దుద్దాం.175 నియోజకవర్గాలకు గాను 175 రైతుబజార్లను పెడతాం. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి.
వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందిస్తాం.మూడో శనివారం ఆఫీసులో ఎవ్వరూ పని చేయొద్దు. మీ ఆఫీస్ లో ఉన్న చెత్తను తీసేయండి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. వేస్ట్ నుంచి పవర్ ను తయారు చేయవచ్చు.డ్వాక్రా సంఘాలు పెట్టాను. ఓర్వకల్లు డ్వాక్రా సంఘం నుంచి పారిశ్రామిక వేత్తలు అవుతున్నారు.
డ్వాక్రా మహిళలకు అండగా ఉంటాను. ఈ ఏడాది లక్ష మందిని పారిశ్రామిక వేత్తలను చేస్తాను. రైతు బజార్ లో ఉన్న తడి చెత్తను ఎరువుగా మార్చి రైతులకు వాడేలా చేస్తున్నారు.. ఇది మంచి ఆలోచన.డ్వాక్రా సంఘాలు ఏం చేస్తాయని కొందరు హేళన చేశారు. కానీ ఇవాళ డ్వాక్రా మహిళలు రేంజ్ ఏంటో చూపించారు..
అది వారి సత్తా.. ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ మహిళలే. దేశంలో ఎవ్వరూ ఇవ్వలేనంత ఫించన్లు ఇస్తున్నాం..అది మా ప్రభుత్వం సత్తా. ఒకటో తేదీ రాగానే అధికారుల ద్వారా ఫించన్లు అందిస్తున్నాం. దీపం పథకాన్ని గతంలో మేమే పెట్టాము..ఇప్పుడు దీపం 2 ద్వారా మహిళలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం” అని చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..