'యూకే ఇంటిమేట్ టూర్' పేరుతో రెహ్మాన్ సంగీత కచేరీ
- July 10, 2016
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్.రెహమాన్ యూకేలోని లీడ్స్, మాంచెస్టర్‌లో 'యూకే ఇంటిమేట్ టూర్' పేరుతో సంగీత కచేరి నిర్వహించనున్నారు. రెహమాన్ ముందుగా సెప్టెంబర్ 22న లండన్‌లోని ఎస్ఎస్ఈ ఎరీనాలో తొలి కచేరి నిర్వహిస్తారు. 24న బర్మింగ్‌హామ్‌లోని బార్క్లేయార్డ్ ఎరీనాలో రెండో కచేరీకి హాజరవుతారు.ఆ తర్వాత 29న లీడ్స్‌లో, 30న మాంచెస్టర్‌లో ఈవెంట్ ఉంటుంది.
'గతేడాది అమెరికాలో 18 రోజుల పాటు పర్యటించి అభిమానుల కోసం కచేరిలు నిర్వహించాను. ఇప్పుడు ఇదే ఆనందాన్ని యూకేలోని నా అభిమానులకు పంచాలనుకుంటున్నాను. ఈ సంగీత విభావరిలో హిందీ, పంజాబీతో పాటు అన్ని భాషల పాటలు పాడి వినిపిస్తాను.' అంటూ రెహమాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







