పేగులలో దాచి కొకైన్ స్మగ్లింగ్.. పట్టుబడ్డ ప్రయాణీకుడు..!!

- May 18, 2025 , by Maagulf
పేగులలో దాచి కొకైన్ స్మగ్లింగ్.. పట్టుబడ్డ ప్రయాణీకుడు..!!

Image for illustration purpose only..

యూఏఈ: అబుదాబి విమానాశ్రయంలో ఒక ప్రయాణీకుడి పేగుల నుండి సుమారు 1,198 గ్రాముల బరువు,  5 మిలియన్ల దిర్హామ్‌ల విలువ కలిగిన ఎనభై తొమ్మిది కొకైన్ గుళికలను స్వాధీనం చేసుకున్నారు. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICAPC)లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది.

దక్షిణ అమెరికా దేశం నుండి వచ్చిన ప్రయాణీకుడిపై విమానాశ్రయంలోని కస్టమ్స్ తనిఖీ బృందానికి అనుమానం కలిగింది. దాంతో అతడిని అధునాతన స్కానింగ్‌ పరికరాలతో స్కానింగ్ చేయగా, అతని శరీరం లోపల గుర్తు తెలియని గుళికలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్య నిఫుణుల సాయంతో అతని పేగుల నుండి 89 గుళికలను బయటకు తీశారు. ఇన్స్పెక్టర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు అథారిటీ అభినందించింది. 

గత వారం, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన నమోదైంది.  స్మగ్లింగ్ మార్గాలను నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అథారిటీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com