తిరుమలలో 24న ‘డయల్ యువర్ ఈవో’
- May 23, 2025
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులతో నేరుగా మాట్లాడేందుకు మరోమారు వేదికను సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తమ అభిప్రాయాలను, సలహాలను, సమస్యలను నేరుగా టీటీడీ కార్యనిర్వహణాధికారి (EO) దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఈ నెల 24 న నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహిస్తారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని, భక్తుల నుండి ఫోన్ ద్వారా అందే సూచనలను, అభిప్రాయాలను స్వీకరిస్తారు. టీటీడీ సేవలు, యాత్రికుల సౌకర్యాలు, ఇతర నిర్వహణాపరమైన అంశాలపై భక్తులు తమ అమూల్యమైన సలహాలను ఈవోకు నేరుగా తెలియజేయవచ్చు.
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు 0877-2263261 అనే టెలిఫోన్ నంబర్‌కు డయల్ చేసి తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఈ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్