యూఏఈలో 23 కంపెనీలకు Dh610,000 జరిమానా..!!
- May 27, 2025
యూఏఈ: ట్యాక్స్ రిపోర్టింగ్ రూల్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబుదాబిలోని ADGM ఫైనాన్షియల్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ (FSRA).. 23 కంపెనీలకు Dh610,000 జరిమానాను ప్రకటించింది. ఆయా సంస్థలు కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ రెగ్యులేషన్స్ 2017 /లేదా ఫారిన్ అకౌంట్ టాక్స్ కంప్లైయన్స్ రెగ్యులేషన్స్ 2022 కింద కంపెనీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. FSRA సీఈఓ ఇమ్మాన్యుయేల్ గివానాకిస్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆర్థిక పారదర్శకతకు యూఏఈ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అన్ని కంపెనీలు ట్యాక్స్ సంబంధిత చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







