సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'కబాలి'

- July 11, 2016 , by Maagulf
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'కబాలి'

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన కబాలి సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా మొత్తం 152 నిమిషాల కాలం నడవనుంది. 

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను  అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన‌ ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌క‌బాలి చిత్రం రిలీజ్ డేట్ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సార్లు మారింది. అయితే...ఎట్ట‌కేల‌కు క‌బాలి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
చెన్నై స‌మాచారం ప్ర‌కారం క‌బాలి చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ చేయ‌నున్నారు. బుధ‌వారం నుంచి క‌బాలి ప్ర‌మోష‌న్స్ స్పీడు పెంచ‌నున్నారు. క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ చేస్తూ బుధ‌వారం ప్ర‌ముఖ దిన‌పత్రిక‌ల్లో రిలీజ్ డేట్ యాడ్ రానున్న‌ట్టు స‌మాచారం.  టీజ‌ర్ & ప్ర‌మోష‌న్స్ లో స‌రికొత్త రికార్డ్స్ సాధించ‌డంతో క‌బాలి చిత్రం పై ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేనంత క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి...ర‌జ‌నీ క‌బాలి చిత్రంతో ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించ‌నున్నాడో ఈనెల 22న తెలుస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com