హిట్ అయిన 'అర్ధనారి'
- July 11, 2016
అర్జున్ యజత, మౌర్యాని జంటగా భానుశంకర్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం 'అర్ధనారి'. పత్తికొండ సినిమాస్ పతాకంపై కర్లపూడి కృష్ణ, ఎమ్.రవికుమార్ నిర్మించారు. భరతరాజ్ సమర్పకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రెండో వారంలో కూడా విజయవంతంగా ఆడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు భానుశంకర్ మాట్లాడుతూ ''ఇప్పటి వరకు నేను తీసిన చిత్రాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఈ కథ తయారు చేశా. 'బాధ్యతలేనివాడికి భారతదేశంతో బతికే హక్కు లేదు' అన్న లైన్‌తోపాటు పంచ సూత్రాలు కాన్సెప్ట్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. సినిమా స్ఫూర్తిదాయకంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. పెద్ద బడ్జెట్‌తో తియ్యాల్సిన ఈ కథను మాకున్ను పరిధిలో నూతన నటీనటులతో తీశాం. ఏ స్టార్ హీరో ఈ సినిమాలో నటించడానికి సాహసించలేదు. అర్జున్ యజత హిజ్రా వేషంతోపాటు బాధ్యత గల పౌరుడిగా యాక్టింగ్ అదరగొట్టాడని ప్రశంసిస్తున్నారు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాతల సహకారం మరువలేనిది'' అని తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







