ఒమన్, ఇరాన్ మధ్య సాంస్కృతిక బంధం..స్మారక తపాలా స్టాంప్ ఆవిష్కరణ..!!

- May 28, 2025 , by Maagulf
ఒమన్, ఇరాన్ మధ్య సాంస్కృతిక బంధం..స్మారక తపాలా స్టాంప్ ఆవిష్కరణ..!!

మస్కట్: ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న సాంస్కృతిక, చారిత్రక సంబంధాలకు గుర్తుగా స్మారక తపాలా స్టాంప్ ను విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది, ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ సయ్యద్ అబ్బాస్ అరఘ్చి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్ ఒమన్ లో అధికారిక పర్యటన సందర్భంగా మస్కట్ లోని అల్ ఆలం ప్యాలెస్ లో ఈ కార్యక్రమం జరిగింది.

ఒమన్ పోస్ట్.. పోస్ట్ మాస్టర్ సయ్యద్ నస్ర్ బిన్ బదర్ అల్ బుసైది మాట్లాడుతూ.. ఈ స్టాంప్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మధ్య లోతైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను ప్రతిబింబిస్తుందని, సాంస్కృతిక దౌత్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడానికి ఇది దోహదం చేస్తుందని అని అన్నారు.
ఈ స్టాంపు రూపకల్పన రెండు దేశాల నిర్మాణ, సాంస్కృతిక చిహ్నాలను ఉపయోగించి తయారు చేసినట్టు తెలిపారు. మస్కట్‌లోని సుల్తాన్ కబూస్ గ్రాండ్ మసీదుతోపాటు దక్షిణ ఇరాన్‌లోని బస్తక్‌లోని చారిత్రాత్మక జామెహ్ మసీదును కలిపి డిజైన్ చేసినట్టు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com