దుబాయ్ లో వెహికల్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి..!!

- May 28, 2025 , by Maagulf
దుబాయ్ లో వెహికల్ టెస్ట్ కోసం ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి..!!

దుబాయ్: జూన్ 2 నుండి, దుబాయ్ అంతటా ఉన్న 27 సాంకేతిక పరీక్షా కేంద్రాలలో వాహన తనిఖీల కోసం RTA దుబాయ్ స్మార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ (www.rta.ae) ద్వారా బుకింగ్‌లు చేసుకోవాలని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. తనిఖీ కేంద్రాలలో రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

అయితే, తస్జీల్ హట్టా సెంటర్‌కు మాత్రమే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం నుండి మినహాయింపు ఉంది. ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా సందర్శించడానికి ఇష్టపడే కస్టమర్‌లకు వాక్-ఇన్ సేవ ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. కాగా, Dh100 అదనపు సేవా రుసుము వర్తిస్తుందని పేర్కొంది.

ఈ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను గత ఏడాది అక్టోబర్‌లో ప్రత్యేకంగా అల్ ఖుసైస్, అల్ బర్షాలోని తస్జీల్ కేంద్రాలలో ప్రారంభించారని RTA లైసెన్సింగ్ ఏజెన్సీలో వాహన లైసెన్సింగ్ డైరెక్టర్ ఖైస్ అల్ ఫార్సీ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com