జార్జియాలో శరవేగంగా కొనసాగుతున్న అఖండ 2 షూటింగ్

- May 30, 2025 , by Maagulf
జార్జియాలో శరవేగంగా కొనసాగుతున్న అఖండ 2 షూటింగ్

టాలీవుడ్‌ నందమూరి అభిమానులకు భారీ ఊహాగానాలకు తావిచ్చే మరో క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2 తాండవం’ షూటింగ్ జార్జియాలో శరవేగంగా జరుగుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ‘అఖండ 2’  పై అభిమానుల్లోనే కాదు, టాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడినవి.

తాజాగా యూనిట్ జార్జియా కు వెళ్లింది.అక్క‌డ సుందరమైన ప్రదేశాలలో సినిమా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకర‌ణ‌కు మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. షెడ్యూల్‌లో బాలకృష్ణపై ఉన్నత స్థాయి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించేందుకు విదేశీ ఫైటర్స్ సేవలను మేకర్స్ వినియోగిస్తున్నారు.

వీడియో వైరల్
జార్జియాలో ‘అఖండ 2’ షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మన్ బాణీలు అందిస్తున్నారు.

స్టార్ క్యాస్టింగ్–విభిన్న తారాగణం
ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఆమె గంభీరమైన నటన సినిమాకు కొత్త ఒరవడి తెచ్చే అవకాశముంది. అదే సమయంలో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.అతని పవర్‌ఫుల్ నెగటివ్ రోల్ ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి.

రిలీజ్ డేట్–దసరా పండుగ కానుకగా
మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా, బాల‌య్య‌, బోయ‌పాటి కాంబోలో ‘సింహా’,’లెజెండ్‌’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఉండ‌డంతో ‘అఖండ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ జోడీ హ్యాట్రిక్ విజయాలు అందించిన నేపథ్యంలో ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com