బహ్రెయిన్‌లో కొత్త బస్ ఫేర్స్
- July 11, 2016
బహ్రెయిన్‌లో బస్ ఫేర్స్‌ని సవరించారు. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఈ వివరాల్ని వెల్లడించింది. కొత్త బస్ ఛార్జీలు జులై 13 నుంచి అమల్లోకి వస్తాయి. సింగిల్ ట్రిప్‌కి దూరంతో సంబందం లేకుండా 250 ఫిల్స్ వసూలు చేయనున్నారు. డైలీ పాస్ కోసం 600 ఫిల్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్ట్ 2015లో బహ్రెయిన్ కొత్త పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. బహ్రెయిన్ వ్యాప్తంగా 32 రూట్లలో కొత్త ప్రాంతాలకు ఈ బస్సుల్ని ఆపరేట్ చేస్తున్నారు. అప్పటినుంచి రోజువారీ పాస్‌లను 500 ఫిల్స్‌కే అందించారు. ప్రమోషనల్ పీరియడ్ కోసం ఈ చార్జీలను నిర్ణయించారు. అయితే ప్రమోషనల్ పీరియడ్ ముగియడంతో బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ కొత్త ధరలను ప్రకటించింది. 28 రోజులకుగాను నెలవారీ పాస్ (గో కార్డ్) ధర 14 బహ్రెయినీ దినార్స్. గోకార్డ్ అలాగే పేపర్ టిక్కెట్ల రూపంలో టిక్కెట్లు లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







