ఫ్రిడ్జ్ కంటే మట్టి కుండే మేలు
- July 11, 2016
కుమ్మరి కుండను పేదవాడి ఫ్రిడ్జ్ గా పేర్కొంటారు. మట్టికుండలోని నీళ్లతో ఆరోగ్యానికి మేలే కాక పర్యావరణానికీ వెలకట్టలేని మంచి జరుగుతుంది. ఫ్రిడ్జ్ నుంచి ఉత్పత్తయ్యే హానికారక వాయువులు సరాసరి ఓజోన్ పొరపైనే ప్రభావం చూపుతున్నాయి. ఇక వీటి వాడకం వల్ల విద్యుత్ బిల్లు భారీగానే ఉంటోంది. వీటన్నింటికీ మట్టి కుండతో చెక్ పెట్టొచ్చని చెప్తున్నారు కుమ్మరులు.
మట్టి కుండల వాడకాన్ని విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చొరవచూపాలన్నది కుమ్మరి కులస్తుల విజ్ఞప్తి. ఎలక్ట్రానిక్ ఫ్రిడ్జ్ ల వల్ల వచ్చే దుష్ప్రభావాలు, అదనపు ఖర్చును అరికట్టేందుకు, విద్యుత్ పొదుపుకు తగిన చర్యలు తీసుకోవాలని వారంటున్నారు. దీనికి ప్రచారంగా ప్రభుత్వా కార్యాలయాల్లో తాగునీటి కోసం మట్టి కుండలను ఏర్పాటుచేయాలని చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి మేలుచేయడంతో పాటూ తమకూ ఉపాధి కల్పించినట్టవుతుందని కుమ్మరులు అంటున్నారు. ఫ్రిడ్జ్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు పేలడంతో అనారోగ్య సమస్యలూ కొనితెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు చెప్తున్నారు. కరెంట్ బిల్ సంగతి పక్కనపెడితే ఫ్రిడ్జ్ వాటర్ తో గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కుండలోని నీటితో ఇలాంటి సమస్యలుండవన్నది నిపుణుల మాట. మట్టి కుండలోని నీటితో శరీరానికి సమతూకమైన చల్లదనం అందుతుంది. చెమటద్వారా కోల్పోయిన లవణాలను ఈ నీటి ద్వారా లభిస్తాయి. కిడ్ని, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. మరి ఇంకెందుకాలస్యం. ఈ వేసవిలో మీరూ మట్టి కుండ నీరు ట్రై చేయండి.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







