కువైట్ లో రాబోయే రెండురోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్స్..!!

- May 30, 2025 , by Maagulf
కువైట్ లో రాబోయే రెండురోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్స్..!!

కువైట్: ఈ వారాంతంలో కువైట్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశం భారత కాలానుగుణ వాయుగుండం ప్రభావం ఉంటుందని,దీని వలన వాయువ్య గాలులతో పాటు వేడి, పొడి గాలి వీస్తుందని యాక్టింగ్ డైరెక్టర్ ధరర్ అల్-అలీ పేర్కొన్నారు.ఈ గాలులు కొన్నిసార్లు చురుకుగా మారవచ్చని,  బహిరంగ ప్రదేశాల్లో దుమ్మును పెంచుతాయని హెచ్చరించారు. పగటి ఉష్ణోగ్రతలు 45°C -47°C మధ్య నమోదవుతాయని తెలిపారు. శుక్రవారం- శనివారం 42°C , 44°C మధ్య గరిష్టస్థాయికి వెళతాయని పేర్కొన్నారు.అప్పుడప్పుడు సముద్ర అలలు 6 అడుగుల వరకు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హీట్ వేవ్స్ నుండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com