యూఏఈలో కొత్త వాతావరణ చట్టం..Dh2 మిలియన్ల జరిమానా..!!
- May 30, 2025
యూఏఈ: యూఏఈలో కొత్త వాతావరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.MENA ప్రాంతంలో వాతావరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి దేశంగా అవతరించింది. కొత్త చట్టం ప్రకారం.. ఉద్గారాల జాబితాలు, మూడవ పక్ష ఆడిట్‌లు, జాతీయ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్‌ను తయారు చేయడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘిస్తే Dh500,00 నుండి Dh2 మిలియన్ల వరకు జరిమానాలు విధిస్తారు. అలాగే, నేషనల్ కార్బన్ క్రెడిట్ రిజిస్ట్రీ యూఏఈని అంతర్జాతీయ కార్బన్ మార్కెట్‌లతో అనుసంధానించడానికి కూడా సిద్ధంగా ఉంది.
దుబాయ్‌లోని కొచ్చర్ & కో ఇంక్ లీగల్ కన్సల్టెంట్స్ సీనియర్ అసోసియేట్ నవన్‌దీప్ మట్టా మాట్లాడుతూ.. చట్టం ఒక సంవత్సరం గ్రేస్ పీరియడ్‌ను అందిస్తుందని, పరిశ్రమలు సర్దుబాటు చేసుకోవడానికి ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. క్లైమేట్-సంబంధిత నష్టాలపై డేటా-షేరింగ్ వంటి వాతావరణ ప్రణాళికలను కొత్త చట్టం తప్పనిసరి చేసింది.
ఇదిలా ఉండగా, గ్రీన్‌పీస్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (మెనా) కొత్త యూఏఈ చట్టాన్ని ప్రశంసించింది. ఇది స్థిరమైన భవిష్యత్తు వైపు ఒక పరివర్తనాత్మక అడుగుగా పేర్కొంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!