సైబరాబాద్: రూ.3 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత …
- May 30, 2025
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.3 కోట్ల విలువ చేసే కేజీన్నర హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా, రాజస్థాన్ రాష్ట్రంలోని నాగ్‌పూర్‌కు చెందిన వికాస్ సాహు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి హెరాయిన్‌తో పాటు ఓపీఎం, పోపీ స్ట్రా, డ్రై గాంజాను స్వాధీనం చేసుకున్నట్లు నేడు జరిగిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపిన వివరాలు ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి డ్రగ్స్ తెస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు ధూల్‌పేటకు చెందిన సలీం, జల్పల్లికి చెందిన రాజు, మధ్యప్రదేశ్‌కు చెందిన గణపత్లుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. షాద్‌నగర్‌లోని సంజుభాయ్ మార్వాడి దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్న వికాస్ సాహుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో దాబా యజమాని సంజుభాయ్తో కలిసి వికాస్ గంజాయి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల అతడు మరణించడంతో దాబాను వికాస్ సాహు నిర్వహిస్తున్నాడు. దాబాకు వచ్చే వారికి కూడా డ్రగ్స్ విక్రయించినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు.
శంషాబాద్‌లోని రాయికల్ టోల్గేట్ వద్ద భారీగా హెరాయిన్ డ్రగ్స్ పట్టుకున్నాం. షాద్‌నగర్‌లోని సంజుభాయ్ మార్వాడి దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్న సమాచారం రావడంతో అక్కడ నిఘా పెట్టాం. హెరాయిన్‌తోపాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశాం. దాబాలో పనిచేసే వంట మనిషి వికాస్ సాహు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అతడికి తెలిసిన కస్టమర్స్‌కు విక్రయిస్తున్నాడు. రూ. 3 కోట్ల విలువ చేసే హెరాయిన్ అతడి వద్ద పట్టుకున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఓపీఎం, డ్రగ్స్ తెస్తున్నారు. బస్సు ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డ్రగ్స్ విక్రయంలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురి పేర్లను వికాస్ సాహూ విచారణలో తెలిపాడు. సలీం, రాజు, గణపత్ అనే ఈ ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. త్వరలోనే పట్టుకుంటాం.” -అవినాష్ మహంతి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







