ఎలాగైనా సినిమా తీయ్యాలి..ఆడియో విడుదల
- July 12, 2016
తరుణ్‌తేజ్, శ్రీలేఖ హీరోహీరోయిన్లుగా తేజ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై లక్ష్మీ దివ్య సమర్పణలో రవికుమార్ పి దర్శకత్వంలో శ్రీమతి పద్మజ నిర్మిస్తున్న చిత్రం ఎలాగైనా సినిమా తీయ్యాలి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత పద్మజకు అందించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..పాటలు చాలా బాగున్నాయి. టీజర్ చాలా బాగుంది. దర్శకుడు రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఫోటోగ్రఫీ హైలైట్‌గా ఉంది. మంచి ప్రమోషన్‌తో చిత్రాన్ని విడుదల చేస్తే తప్పకుండా విజయవంతం అవుతుందని..అన్నారు.
దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ..ఎలాగైనా సినిమా తీయ్యాలి చిత్రాన్ని ఒక ఆశయంతో తీశాం. ఒక యువకుడు చదువు కోసం సీటీకి వచ్చి సినిమా మీద ఫ్యాషన్‌తో చదువును మానేసి చిత్ర పరిశ్రమకు వచ్చి ఏమి సాధించలేక చనిపోతే, అన్న ఆశయం కోసం తమ్ముడు చదువును మాని చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా విజయం సాధించాడు అన్నదే చిత్ర కథ. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాను. దీని తర్వాత రెండు చిత్రాలు చేస్తున్నాను. ఈ నెలాఖరుకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







