గోల్డ్ లోన్స్ పై రూల్స్..కేంద్రం కీలక సూచనలు

- May 31, 2025 , by Maagulf
గోల్డ్ లోన్స్ పై రూల్స్..కేంద్రం కీలక సూచనలు

న్యూ ఢిల్లీ: బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే చిన్న రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.రూ.2 లక్షలలోపు గోల్డ్ లోన్ తీసుకునేవారికి కొత్త నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేలా RBIకి కేంద్ర ఆర్థిక శాఖ సూచనలు పంపింది.ఇది చిన్న రైతులు, వ్యాపారులు, మహిళల కోసం ఒక శుభవార్తగా మారింది.

2026 జనవరి 1 నుంచి మినహాయింపు అమలు

ఈ మినహాయింపు 2026 జనవరి 1 నుండి అమల్లోకి రానుంది. అంటే అప్పటి వరకు ఇప్పటికే ఉన్న నిబంధనలు కొనసాగుతాయి.ఈ నిర్ణయం కారణంగా చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి డాక్యుమెంటేషన్, వాల్యుయేషన్, ఇతర నిబంధనల భారం తగ్గనుంది.బ్యాంకుల పనితీరు వేగవంతం కావడం ద్వారా వినియోగదారులకు కూడా త్వరిత రుణ లభ్యత కుదురనుంది.

గతంలో రుణ పరిమితిపై కఠిన నిబంధనలు విధించిన RBI

గత ఏడాది ఆగస్టులో తాకట్టు పెట్టిన బంగారం విలువలో గరిష్ఠంగా 75% వరకు మాత్రమే రుణం ఇవ్వాలన్న నిబంధనను RBI ప్రవేశపెట్టింది.దీనివల్ల చాలా మంది చిన్న రుణగ్రహీతలకు నష్టమవుతోంది.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, చిన్న మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి మరింత సౌలభ్యం కలిగించనుంది.బ్యాంకులు కూడా దీనికి అనుగుణంగా విధానాలను సడలించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com