UPS కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు

- May 31, 2025 , by Maagulf
UPS కింద రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు

న్యూ ఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీమ్‌ (NPS)లో సభ్యులుగా ఉన్న రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మరో శుభవార్త. ప్రభుత్వం నూతనంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద అదనపు ప్రయోజనాలు అందించేందుకు ముందుకు వచ్చింది.కనీసం పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి, 2025 మార్చి 31వ తేదీకి ముందే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి.ఇది ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న మంచి నిర్ణయంగా భావిస్తున్నారు.

బేసిక్, డీఏలలో పదోవంతు తక్షణ లాభం

ఈ స్కీమ్ కింద ఉద్యోగులు తమ సర్వీస్ చివర్లో పొందిన బేసిక్ పే మరియు డీఏలలో పదో వంతు మొత్తాన్ని తక్షణమే పొందే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా, మూలవేతన సగటులో 50 శాతం పెన్షన్ కల్పించనున్నారు. ఇది NPS కింద ఉన్న ఉద్యోగులకి ఒకింత ఊరట కలిగించే అంశంగా నిలుస్తుంది. పెన్షన్ లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఇది ఆర్థికంగా కొంత భరోసా కలిగించనుంది.

జూన్ 30లోగా దరఖాస్తు తప్పనిసరి

ఈ అదనపు ప్రయోజనాలను పొందాలంటే ఆసక్తి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా జూన్ 30వ తేదీలోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.ఇందుకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు విధానం సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత శాఖల కార్యాలయాల ద్వారా పొందవచ్చు.కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం ఎంతోమంది పింఛన్ దారులకు కొత్త ఆశను కలిగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com