హిందీ టీవీ సీరియల్స్ లో స్టార్ హీరోయిన్ కూతురు..!
- July 12, 2016
అలనాటి నటి రాధ హీరోయిన్‌గా ఎన్నో సక్సెస్‌లు చూసింది. విజయవంతమైన చిత్రాల్లో తనవంతు పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాధకు ఇద్దరు కుమార్తెలు కాగా...పెద్ద అమ్మాయి కార్తీక, చిన్నమ్మాయి తులసి నాయర్ ఇప్పటికే హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించారు. తెలుగునాట అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా ఆరంగేట్రం చేసిన 'జోష్' చిత్రంతోనే కార్తీక కూడా వెండితెరకు పరిచయమయింది. తర్వాత తెలుగులో ఎన్టీఆర్ నటించిన 'దమ్ము', అల్లరి నరేష్ చెల్లెలిగా 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' చిత్రాల్లో నటించినా..ఆ సినిమాలు ఆశించినా స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాకపోవడంతో కార్తీకకు గుర్తింపు దక్కలేదు. తమిళంలో 'రంగం' చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా..అక్కడ రెండు, మూడు చిత్రాలకే పరిమితమైంది. దీంతో కొద్దిరోజులుగా సిల్వర్ స్ర్కీన్‌కు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు..ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకుందట. కానీ హిందీ టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







