ఇరాకీ సైనిక దళాలకు అమెరికా సైన్యం సహకారం
- July 12, 2016
అమెరికాః ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడంలో ఇరాక్ కు సహకరించేందుకు అమెరికా మరింత ముందుకొచ్చింది. ఇరాక్ లో ఉగ్రవాదుల అధీనంలోకి వెళ్ళిన మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాక్ దళాలకు సహాయం అందించేందుకు మరో అడుగు వేసింది. ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ ని విడిపించేందుకు, ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాకీ దళాలకు సహాయంగా 560 అమెరికా దళాలను పంపింస్తున్నట్లు అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్ వెల్లడించారు. మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాడేందకు అమెరికా తనవంతు కృషి చేస్తోంది. ఇరాక్ లో ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ దళాలకు మద్దతుగా దాదాపు 560 అమెరికా సైనిక దళాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అమెరికా ముందుంటుందని, ఇరాకీ సైనిక దళాలకు అమెరికా సైన్యం తగినంత సహకారం అందిస్తుందని అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్.. తన అప్రకటిత బాగ్దాద్ పర్యటనలో భాగంగా తెలిపారు. కార్టర్ తన పర్యటనలో అమెరికా కమాండర్లు, ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ, రక్షణ మంత్రి ఖలీద్ అల్ ఒబైదీ లను కలుసుకున్నారు. మరోవైపు కొత్తగా పంపిస్తున్న వారిలో ఇంజనీర్లు, లాజిస్టిక్స్ మరియు ఇతర సిబ్బంది కూడ ఉన్నట్లు కార్టర్ తెలిపారు. వారంతా మాసూల్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న కయారా ఎయిర్ బేస్ అభివృద్ధికి సైతం సహాయం అందిస్తాయన్నారు.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







