దుబాయ్ లో ఉచిత పార్కింగ్, మెట్రో, బస్సు సమయాలు..!!
- June 03, 2025
దుబాయ్: ఈద్ అల్ అధాను పురస్కరించుకొని జూన్ 5 నుండి 8 వరకు దుబాయ్‌లో పబ్లిక్ పార్కింగ్ ఉచితం అని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం మల్టీ-లెవల్ పార్కింగ్ టెర్మినల్స్ కు వర్తించవని తెలిపింది. అలాగే ప్రజా రవాణా సమయాలను ప్రకటించింది. జూన్ 4 నుండి జూన్ 7 వరకు దుబాయ్ మెట్రో ఉదయం 5 గంటల నుండి ఉదయం 1 గంటల వరకు (మరుసటి రోజు) నడుస్తుంది. దుబాయ్ ట్రామ్ ఉదయం 6 గంటల నుండి ఉదయం 1 గంటల వరకు (మరుసటి రోజు) నడుస్తుంది.
బస్సు సమయాలు
తాజా బస్సు సమయాల కోసం సాహెల్ యాప్‌ను చెక్ చేయాలని నివాసితులను కోరారు. బస్ రూట్ E100 అల్ గుబైబా బస్ స్టేషన్ నుండి పనిచేయదు. ఈ సమయంలో ప్రయాణికులు ఇబ్న్ బటుటా బస్ స్టేషన్ నుండి అబుదాబికి E101ని ఉపయోగించాలని కోరారు. బస్ రూట్ E102 ఇబ్న్ బటుటా బస్ స్టేషన్, ముసాఫా గుండా వెళ్ళకుండా అల్ జాఫిలియా బస్ స్టేషన్ నుండి అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా నడుస్తుంది.
కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లు
ఈద్ అల్ అధా సెలవుదినం అంతటా అన్ని RTA కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు పనిచేయవు. అయితే, ఉమ్ రామూల్, దీరా, అల్ బర్షా, ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలోని స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు ప్రతిరోజూ 24 గంటలపాటు పనిచేస్తాయని అన్నారు.
జూన్ 5 నుండి 7 వరకు సర్వీస్ ప్రొవైడర్ కేంద్రాలు మూసివేయబడతాయి. జూన్ 8న తస్జీల్ అల్ తవార్, ఆటోప్రో అల్ మంఖూల్, తస్జీల్ అల్ అవిర్, అల్ యలాయిస్, షామిల్ ముహైస్నా కేంద్రాలలో సాంకేతిక పరీక్షా సేవలు మాత్రమే తిరిగి ప్రారంభమవుతాయి. లావాదేవీ ప్రాసెసింగ్, సాంకేతిక పరీక్షతో సహా అన్ని సేవలు జూన్ 9న అన్ని కేంద్రాలలో తిరిగి ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్‌లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్‌లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో