ఖతార్ లో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- June 03, 2025 , by Maagulf
ఖతార్ లో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

దోహా: ఖతార్ తెలంగాణ గల్ఫ్ సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఆ దేశ రాజధాని దోహ నగరంలో వేలాది మంది కార్మికుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ఖతార్ మినిస్టర్ ఆఫ్ లేబర్ ఖలీద్ మొహమ్మద్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఖండాంతరాలు దాటి ఇక్కడికి వచ్చిన తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా కులమత బేధాలు లేకుండా, అందర్నీ ఏకం చేసి ఒక వేదికపైకి తీసుకొచ్చి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షణకు పూనుకోవడంతో పాటుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఖాతార్ తెలంగాణ గల్ఫ్ సమితి కార్మిక సంఘానికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, కార్మికులను తప్పకుండా అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు.వారితో పాటు టీపీసీసీ ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం అధ్యక్షులు, గల్ఫ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి మరియు గల్ఫ్ బోర్డు అడ్వైజరి కమిటీ మెంబర్ గుగ్గిళ్ళ రవి గౌడ్ హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఖాతార్ తెలంగాణ గల్ఫ్ సమితి గౌరవ అధ్యక్షులు సుందరగిరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించే దిశగా గల్ఫ్ అడ్వైజరీ కమిటీని ఏర్పడడం చాలా ఆనందకరమని, ఈ కమిటీ ఏర్పాటు చేసినందుకు గల్ఫ్ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఖతార్ లేబర్ మినిస్టరీ ప్రతినిధి ఖాలీద్ ఫాహ్కుర్ మాట్లాడుతూ గల్ఫ్ సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే, ఎస్సీబీఎఫ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు శానవాజ్ బావా తెలంగాణ గల్ఫ్ సమితి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని గుర్తు చేశారు. ఎస్సీబీఎఫ్ అడ్వైజరీ చైర్మన్ కోడూరి శివప్రసాద్  మాట్లాడుతూ ఖాతార్ దేశంలో ఉన్న తెలుగు సంఘాలు ఐకమత్యంగా, స్నేహ సంబంధాలు నెరుపుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసీసీ అడ్వైజరీ చైర్మన్ బాబు రాజన్న మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా కార్మికులకు  సేవ చేస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ గల్ఫ్ సమితి అని గుర్తు చేశారు.

అలాగే, ఎస్సిబీఎఫ్ ఉపాధ్యక్షుడు రషీద్ మహమ్మద్, ఎస్సీబీఎఫ్ జనరల్ సెక్రెటరీ దీపక్ శెట్టి, సెక్రెటరీ జాఫర్, అమర్ సింగ్, ఐసీసీ నుంచి సంస్కృత కార్యదర్శి నందిని అబ్బగౌని, ఐసీసీ మెంబర్ వెంకప్ప, ఐసీసీ కార్యవర్గ సభ్యులైన దీపక్ చుక్కల, సోమరాజు మరియు తెలుగు సంఘాలు అధ్యక్షులు, హరీష్ రెడ్డి , సుధ శ్రీరామోజుల, నరసింహ మూర్తి ,అబ్బాగౌని శ్రీధర్, తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు సంధ్యారాణి ,ఎల్లయ్య బండపెళ్లి, వెంకటేష్, మనోహర్, ప్రీతిష్, రజిత రెడ్డి, రాకేష్,ప్రసాద్ నిమ్మల,రాజేశ్వర్, అడ్వైజర్ చైర్మన్ కృష్ణకుమార్, ఎల్లయ్య తల్లపెళ్లి, చింతకుంట మహేందర్, గడ్డి రాజు, కృష్ణా శ్రీ రామోజు, గోలి శ్రీనివాస్,ప్రవీణా ముకల నెల రోజులుగా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com