ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం
- July 12, 2016
ఇటలీలోని దక్షిణ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో 20 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. బారి నగర సమీపంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. అత్యవసర సేవల విభాగం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పలువురిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొన్ని రైళ్ల బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది బయటకు తీసుకొస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన ట్రాక్‌పై రోజూ 200 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఇతర రైళ్ల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా అదనంగా ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఘటనపై ఇటలీ ప్రధాని మాట్టెయో రేంజి విచారం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







