ఈద్ అల్ అధా: యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- June 05, 2025
యూఏఈః యూఏఈలోని నివాసితులు ఈద్ అల్ అధాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వారాంతంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి కాలం రాకముందే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నివాసితులు ఎండల తీవ్రత నుండి కొంత ఉపశమనం కోసం ఆశిస్తున్నారు.కాగా, రాబోయే వీకెండ్(సెలవు రోజుల్లో)లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. యూఏఈ వాతావరణ శాఖ, నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) జూన్ 6, 7 , 8 తేదీలలో వర్షం పడుతుందని అంచనా వేసింది. జూన్ 6న అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని,కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని NCM తెలిపింది. జూన్ 7న విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తూర్పు, ఉత్తరం ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 8న దేశవ్యాప్తంగా వర్సాలు కురుస్తాయని NCM తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్