ఓల్డ్ దోహా పోర్టులో 4 రోజులపాటు మారిటైమ్ ఉత్సవాలు..!!

- June 05, 2025 , by Maagulf
ఓల్డ్ దోహా పోర్టులో 4 రోజులపాటు మారిటైమ్ ఉత్సవాలు..!!

దోహా, ఖతార్: ఓల్డ్ దోహా ఓడరేవు ఈ ఈద్ అల్-అధా వేడుకలకు సిద్ధమవుతోంది. జూన్ 6 నుండి జూన్ 9 వరకు, నాలుగు రోజుల సముద్ర ప్రదర్శనలు, ఖతార్ సముద్రయాన వారసత్వాన్ని తెలిపేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతి సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు, ఖతార్ ఓడరేవు సందర్శకులను ఆకట్టుకోనుంది. ఎత్తైన స్టిల్ట్ వాకర్లు, నడిచే చెట్లు, రోలర్-స్కేటింగ్ పాత్రలు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. "ఓల్డ్ దోహా పోర్టులో ఈద్ అల్ అధా ఉత్సవాలు ప్రజలను సముద్రంతో అనుసంధానిస్తాయి" అని ఓల్డ్ దోహా పోర్ట్ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com