సినిమా రివ్యూ: ‘థగ్ లైఫ్’
- June 05, 2025
రంగరాయ శక్తి రాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్ స్టర్. ఢిల్లీలో తన అన్న మాణిక్యం (నాజర్)తో కలిసి గ్యాంగ్ స్టర్‌గా దందాలు చేస్తుంటాడు. ఒకానొక సందర్భంలో తన ప్రత్యర్ధి గ్యాంగ్‌స్టర్ అయిన సదానంద్ (మహేష్ మంజ్రేకర్)తో దాడిలో సందర్భంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి అమర్ (శింబు) సాయంతో ప్రాణాలు కాపాడుకుంటాడు. అప్పటి నుంచీ ఆ చిన్నారిని పెంచి పోషిస్తాడు. సొంత కొడుకులా చూస్తాడు. కానీ, అనుకోకుండా ఓ సందర్భంలో ఆ చిన్నారిపై అనుమానం కలుగుతుంది రంగరాయకు. అంతేకాదు, అమర్ కూడా తన తండ్రిని చంపింది రంగరాయేనని నమ్ముతాడు. దాంతో, రంగరాయని లోయలో పడేసి చంపేయాలని ప్లాన్ చేస్తాడు. లోయలో పడిపోయిన రంగరాయ చనిపోయాడని భావిస్తాడు. ఆ తర్వాత రంగరాయ సామ్రాజ్యాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకుని అమర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. కానీ, రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన రంగరాయ.. అమర్‌తో ఎలాంటి వైరం పెట్టుకున్నాడు.? జీరోగా మారిన తన జీవితాన్ని తిరిగి ఎలా దక్కించుకోగలిగాడు.? చిన్నప్పుడే తప్పిపోయిన చంద్ర (ఐశ్వరలక్ష్మి)కీ, అమర్‌కి సంబంధం ఏంటీ.? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ‘థగ్ లైఫ్’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
కమల్ హాసన్, ఎప్పటిలాగే తనదైన నటనతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సీన్లలో ఎటువంటి బెరుకు లేకుండా నటించేశారు వయసుకు మించి, శింబుతో సాగే యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో పీక్స్ లెవల్ నటన కనబరిచారు. ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ శింబు. శింబు నటించాడు.. అనే కన్నా జీవించేశాడు అనడం సబబు. హీరోయిన్గా త్రిషకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి. కానీ, అభిరామి పాత్ర ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య లక్ష్మి పాత్ర పరిధి మేర వుంటుంది. నాజర్, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితర సీనియర్ నటులు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఇది. నిజానికి పెద్దగా అంచనాల్లేవు. కానీ, సినిమా రిలీజ్‌కి ముందు వచ్చిన వివాదాలు ఒకింత ఆసక్తిని క్రియేట్ చేశాయ్. అయితే, ఆ ఆసక్తి సినిమా చూశాకా ఎంత మాత్రం కనిపించదు. ఆశించిన రీతిలో సినిమాని తెరకెక్కించలేకపోయారు మణిరత్నం. కథ పాతదే, కథనం కూడా ఏమంత గొప్పగా అనిపించదు. డల్ స్క్రీన్‌ప్లే, రొటీన్ రొట్టకొట్టుడు గ్యాంగ్ స్టర్ సన్నివేశాలు.. తర్వాత ఏం జరుగుతుంది.. అనే విషయం ముందుగానే ప్రేక్షకుడి దృష్టికి తట్టేస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు, యాక్షన్ ఘట్టాలు స్పీడ్‌గా కథని నడిపిస్తాయ్. కానీ, సెకండాఫ్ మాత్రం బోరింగ్. సాగతీత సన్నివేశాలు ఎక్కువగా వుంటాయ్. ఇంటర్వెల్ బ్లాక్‌కి ఇచ్చిన హైప్‌కి సెకండాఫ్ ఇరగదీసేస్తానుకుంటాం. కానీ, చప్పబడిపోయింది. ఫస్టాఫ్‌లోని ఢిల్లీలో ల్యాంగ్ స్కామ్ తదితర సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ బాగుంటుంది. ఇలాంటి సినిమాలకు ముఖ్యంగా బీజీఎమ్ ప్లస్ అవ్వాలి కానీ, రెహమాన్ మ్యూజిక్ ఎందుకో డల్ అనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే, ఫైట్ సన్నివేశాల్లోనూ బీజీఎమ్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు రెహమాన్ స్థాయికి. ఎడిటింగ్‌లో చాలానే పని వున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ జస్ట్ ఓకే. కమల్ హాసన్ - మణిరత్నం కాంబో స్థాయిలో వుండనే వుండదు.
ప్లస్ పాయింట్స్:
కమల్ హాసన్, శింబు పర్ృఫామెన్స్, యాక్షన్ ఘట్టాలు, ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్లాక్..
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లోని సాగతీత సన్నివేశాలు, రొటీన్ రొట్టకొట్టుడు కథ, కథనాలు తదితర..
చివరిగా:
‘థగ్ లైఫ్’.. టైటిల్లో వున్న పవర్ సినిమాలో లేదు. జస్ట్ ఓ రెగ్యులర్ అండ్ రొటీన్ గ్యాంగ్‌స్టర్ రివేంజ్ డ్రామా.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!