టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్

- June 05, 2025 , by Maagulf
టికెట్ల బుకింగ్‌కు ఈ-ఆధార్ ఉండాల్సిందే: మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్

న్యూ ఢిల్లీ: తాత్కాల్ టికెట్ల జారీలో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను అడ్డుకునేందుకు భార‌తీయ రైల్వే కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ది. తాత్కాల్ టికెట్లు పొందేందుకు ఈ-ఆధార్ త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు.ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని చెప్పారు.త్వ‌ర‌లోనే ఈ-ఆధార్ ఆధారంగా తాత్కాల్ టికెట్లు పొందే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో నిజ‌మైన యూజ‌ర్ల‌కు క‌న్ఫ‌ర్మ్ టికెట్లు ద‌క్కాల‌న్న ఉద్దేశంతో ఈ-ఆధార్‌ను తాత్కాల్ టికెట్ల‌కు త‌ప్ప‌నిస‌రి చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

ఐడీల‌ను డీయాక్టివేట్ చేశాం: రైల్వే శాఖ

ఐఆర్సీటీసీ పోర్ట‌ల్ ద్వారా జ‌రుగుతున్న టికెట్ల బుకింగ్ అక్ర‌మాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా సుమారు 2.5 కోట్ల బోగ‌స్ ఐడీల‌ను బ్లాక్ చేసిన‌ట్లు రైల్వే శాఖ చెప్పింది. ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ ద్వారా ఆ ఐడీల‌ను డీయాక్టివేట్ చేసిన‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. మే 22వ తేదీన ఒక నిమిషంలో అత్య‌ధిక సంఖ్య‌లో టికెట్లు బుక్ అయ్యాయ‌ని, ఆ రోజున కేవ‌లం 60 సెక‌న్ల‌లో 31,814 టికెట్లు బుక్ అయిన‌ట్లు రైల్వే శాఖ చెప్పింది. ఆప‌రేష‌న‌ల్ సామ‌ర్థ్యంలో ఇదో కొత్త మైలురాయిని రైల్వే శాఖ తెలిపింది.

జాప్యం లేకుండా టికెట్‌ను పొంద‌వ‌చ్చు
తాత్కాల్ బుకింగ్ స‌మ‌యంలో.. మొద‌టి 5 నిమిషాల్లో ట్రాఫిక్ తారాస్థాయిలో ఉంటుంద‌ని, అయితే కొత్త బాట్ సిస్ట‌మ్ ద్వారా ఆ ట్రాఫిక్‌ను రెగ్యులేట్ చేసిన‌ట్లు రైల్వే శాఖ పేర్కొన్న‌ది. టికెట్ బుకింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు కొత్త యూజ‌ర్ ప్రోటోకాల్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆధార్ వెరిఫికేష‌న్ లేని యూజ‌ర్లు.. రిజిస్ట్రేష‌న్ త‌ర్వాత మూడు రోజుల‌కు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ-ఆధార్ వెరిఫై యూజ‌ర్ ఎటువంటి జాప్యం లేకుండా టికెట్‌ను పొంద‌వ‌చ్చు అని రైల్వే శాఖ చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com