ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న 'రియో డి జనారియో'

- July 12, 2016 , by Maagulf
ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న 'రియో డి జనారియో'

మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్‌ పండగ ప్రారంభం కానుంది. రియో డి జనారియో వేదికగా జరగబోయే ఈ పోటీల కోసం ప్రపంచ క్రీడాకారులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 5 నుంచి21 వరకు సాగే ఈ ఉత్సవానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

* దక్షిణ అమెరికాలో ఒలింపిక్స్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి.* 17 వేల మంది ఒలింపిక్‌ అథ్లెట్లు, నిర్వాహకులు పాల్గొంటున్నారు. . * 206 దేశాలకు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో పోటీపడనున్నారు. * ఒలింపిక్స్‌ పండగను ప్రారంభించే మరకానా స్టేడియం సామర్థ్యం 78 వేల మంది. ఇదే స్టేడియంలో ముగింపు వేడుకలు కూడా నిర్వహించనున్నారు. * తొలిసారిగా ఓ శరణార్థుల జట్టు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొననుంది. * పోటీలను వీక్షించేందుకు కోసం 75 లక్షల టిక్కెట్లను అమ్మకానికి ఉంచారు. * 5 లక్షల మంది విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా. * ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేకంగా 16 కిలోమీటర్ల పొడవుగల భూగర్భ మెట్రో వ్యవస్థను ఏర్పాటు చేశారు. * 61 శాతం మంది స్థానికులు రియోలో పోటీలను నిర్వహించడం గొప్పగా భావిస్తే.. 27శాతం మంది మాత్రం అవసరం లేదంటున్నారు. * ఒలింపిక్స్‌ సమయంలో క్రీడా గ్రామంలోని డైనింగ్‌ హాల్‌లో రోజుకు 60వేల భోజనాలను వడ్డించనున్నారు. * 25వేల మంది విలేకరులు ఈ పోటీల కవరేజీకి వస్తున్నారు. * ఫుట్‌బాల్‌ పోటీల కోసం 400 బంతులను వినియోగించనున్నట్లు అంచనా. * ఫుట్‌బాల్‌ దేశంగా పేరొందిన బ్రెజిల్‌ ఒలింపిక్స్‌లో ఒక్కసారి కూడా పతకం సాధించలేకపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com