ప్రొ కబడ్డీలో బెంగళూరుపై గెలిచిన తెలుగు టైటాన్స్
- July 12, 2016
ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా బెంగళూరు బుల్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 8 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే బెంగళూరు డిఫెండర్లపై టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి వరుస రైడ్లతో ఎదురుదాడి చేయడంతో ఒకానొక దశలో తెలుగు టైటాన్స్ 10-1తో నిలిచింది. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 16-10తో ఆధిక్యం సాధించిన టైటాన్స్ ద్వితీయార్థంలో కాస్త తడబడినట్లు కనిపించింది.
కానీ చివర్లో పుంజుకున్న టైటాన్స్ తప్పిదాలను తగ్గించుకోవడంతో మ్యాచ్ను 32-24తో గెలుపుగా ముగించగలిగింది. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ 24 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







