పాలస్తీనా సభ్యత్వ హోదా పెంపు.. స్వాగతించిన ఖతార్..!!
- June 07, 2025
దోహా: అంతర్జాతీయ కార్మిక సంస్థ పాలస్తీనా సభ్యత్వ హోదాను పెంచింది. "లిబరేషన్ మూవ్ మెంట్" నుండి "నాన్ మెంబర్ అబ్జర్వర్ మెంబర్"గా పెంచాలని చేసిన ప్రకటనను ఖతార్ స్వాగతించింది. అంతర్జాతీయ కార్మిక సమావేశం 113వ సెషన్లో ఓటు ద్వారా తీర్మానాన్ని ఆమోదించారు. పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులకు అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నట్లు ఖతాన్ తన ప్రకటనలో అభివర్ణించింది.
అంతర్జాతీయ సంస్థలో పూర్తి సభ్యత్వానికి పాలస్తీనా హక్కుకు మద్దతు ఇచ్చే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ఈ ప్రకటన ఏకీభవించిందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో పాలస్తీనా స్థానాన్ని బలోపేతం చేసే విధంగా తీర్మానాన్ని అమలు చేయాలని ఖతార్ పిలపునిచ్చింది.
అంతర్జాతీయ చట్టబద్ధత తీర్మానాలు, రెండు-రాష్ట్రాల పరిష్కారం ఆధారంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని ఖతార్ కోరుతోంది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల వెంబడి స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







