బహ్రెయిన్ ఇండియన్ స్కూల్లో ఘనంగా ఈద్ వేడుకలు..!!
- June 07, 2025
మనామా: బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (BIS) లో ఈద్ అల్ అధా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యంతం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిలో సామరస్యం, ఫెస్టివ్ స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమం విద్యార్థులలో సాంస్కృతిక అవగాహన, పరస్పర గౌరవం, ఆధ్యాత్మిక విలువలను పెంచుతుందని ప్రిన్సిపాల్ సాజి జాకబ్ తెలిపారు.
కిండర్ గార్టెన్ విద్యార్థుల ఖవ్వాలి ప్రదర్శనతోపాటు రంగురంగుల సాంప్రదాయ దుస్తులను ధరించి ఈద్ ప్రాముఖ్యతపై ఒక చిన్న స్కిట్ కూడా ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమం తర్వాత, విద్యార్థులు ఈద్ నేపథ్య కార్యకలాపాలలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ సాజి జాకబ్ ఈద్ సారాంశాన్ని, దాని ఐక్యతను హైలైట్ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడంతో కార్యక్రమం ముగిసింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







