ఘనంగా బక్రీద్ వేడుకలు
- June 07, 2025
హైదరాబాద్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు.
పండుగ సందర్భంగా హైదరాబాద్‌తోపాటు గ్రామాలు, పట్టణాల్లోని మసీదులు, ఈద్గాలకు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కొత్తబట్టలు ధరించి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బక్రీద్ పర్వదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. శనివారం జిల్లా కేంద్రం శివారులోని ఈద్గా వద్ద వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







