కన్నప్ప సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ తీసేసాం: మంచు విష్ణు

- June 07, 2025 , by Maagulf
కన్నప్ప సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ తీసేసాం: మంచు విష్ణు

మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలామంది స్టార్స్ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఇంతమందితో పాటు రజినీకాంత్ ని కూడా తీసుకోవాలని అనుకున్నారట.

తాజాగా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి తెలిపాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాలో రజినీకాంత్ గారిని కూడా తీసుకోవాలి అనుకున్నాం. ఒక క్యారెక్టర్ కూడా రాసాము. నాన్న గారి కాంబోలో ఆ క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఆ సీన్స్ సినిమాలో సరిగా సెట్ అవ్వలేదు. మనకి కామియో కంటే కూడా కథ ఇంపార్టెంట్. అందుకే కథలో ఆ పాత్ర సెట్ అవ్వలేదని రజినీకాంత్ కోసం రాసుకున్న క్యారెక్టర్ తీసేసాము. నాన్న అడిగితే రజినీకాంత్ ఓకే అంటారు అని తెలిపారు. ఇక కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com