తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్
- June 08, 2025
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు.ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్స్‌గా రవీంద్ర గోపాల, ఉదయ్ కుమార్ రెడ్డి.కె, సెక్రటరీగా శ్రీధర్ వి.ఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్ర శేఖర్ రావు.జే, ట్రెజరర్ గా సత్యన్నారాయణ గౌడ్.బి ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ..అందరికీ థాంక్ యూ. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు. ఐ విల్ డూ మై బెస్ట్'అన్నారు.
సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ..ఇది 80వ జనరల్ బాడీ మీటింగ్.ది ఓల్డెస్ట్ ఛాంబర్. 80 ఏళ్ల క్రితం ఈ ఛాంబర్ పెట్టారు. నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు.పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను'అన్నారు.
జెమినీ కిరణ్ మాట్లాడుతూ.. సునీల్ అండ్ టీం కి ఆల్ ది వెరీ బెస్ట్. కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు'తెలిపారు.
సురేష్ బాబు మాట్లాడుతూ....తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరికీ నా బెస్ట్ విషెస్. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఛాంబర్. సునీల్ అండ్ టీం కి ఆల్ ది వెరీ బెస్ట్'అన్నారు
కె.ఎల్ దామోదర్ ప్రసాద్.. అందరికి నమస్కారం.ఇది వెరీ హ్యాపీ అకేషన్. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కొత్తగా ఎన్నికైన టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







