జుమేరా బీచ్‌లో విషాదం.. స్కూబా డైవింగ్ సెషన్‌లో భారతీయ ప్రవాసి మృతి..!!

- June 08, 2025 , by Maagulf
జుమేరా బీచ్‌లో విషాదం.. స్కూబా డైవింగ్ సెషన్‌లో భారతీయ ప్రవాసి మృతి..!!

దుబాయ్: జుమేరా బీచ్‌లో స్కూబా డైవింగ్ సెషన్‌లో 29 ఏళ్ల భారతీయ ప్రవాసి ప్రాణాలు కోల్పోయాడు.  ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్‌లో తన కుటుంబంతో గడుపుతుండగా ఈ విషాదకర దుర్ఘటన చోటుచేసుకుంది.  మృతుడిని ఇస్సాక్ పాల్ ఒలక్కెంగిల్‌గా గుర్తించారు. అతను యూఏఈలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని బంధువుల కథనం ప్రకారం, నీటి అడుగున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఇస్సాక్ గుండెపోటుకు గురయ్యాడు.   అతన్ని వెంటనే నీటిలోంచి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించాడు.  “అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయడానికి మేము ప్రస్తుతం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నాము” అని మృతుని మామ ప్యారిలోస్ తెలిపారు.  

జుమేరాలోని యాంఫిబియస్ స్విమ్ స్కూల్ వ్యవస్థాపకుడు , సీఈఓ, ఫిలిప్పీన్స్ బోధకుడు బింబో కాలిటిస్ మాట్లాడుతూ.. “డైవింగ్ నేర్చుకోవాలనుకునే వారు ముందుగా డైవింగ్ స్కూల్ నేపథ్యం, వాటి అనుభవాన్ని చెక్ చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ పూర్తిగా చదవకుండానే వాటిపై సంతకాలు చేస్తున్నారు. డైవింగ్ స్కూల్‌ను చట్టపరమైన బాధ్యతల నుండి విముక్తి చేస్తున్నారు.” అని ఆయన వివరించారు. “లెర్నర్స్ ముందుగా వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి.” అని ఆయన సూచించారు.  లైసెన్స్ పొందిన, విశ్వసనీయమైన డైవింగ్ పాఠశాలలను మాత్రమే ఎంచుకోవడం ద్వారా ఇలాంటి దుర్ఘటనలను నివారించవచ్చని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com