లిమాలో భారీ వర్షానికి దెబ్బతిన్న రహదారులు..!!

- June 08, 2025 , by Maagulf
లిమాలో భారీ వర్షానికి దెబ్బతిన్న రహదారులు..!!

మస్కట్: ముసాండం గవర్నరేట్‌లోని లిమాలోని నియాబాత్‌లో భారీ వర్షం కురిసింది. రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా వాడి అల్ ఖాబా, వాడి అల్ అక్బ్, వాడి అల్ అక్, వాడి అల్ ఘాబ్న్, ఖార్టూమ్ అల్ అస్ఫర్, వాడి అల్ ఖాసీదాతో సహా వాడిలు పొంగిపొర్లాయి.

ఖసబ్ మునిసిపాలిటీ డైరెక్టర్ హమద్ బిన్ ఇబ్రహీం అల్ షుహి మాట్లాడుతూ.. లిమాలోని నియాబత్ అరుదైన వాతావరణ పరిస్థితి వల్ల భారీ వర్షపాతం సంభవించిందన్నారు. ఫలితంగా, కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయని, అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. భారీ వర్షంతో ప్రభావితమైన ప్రాంతాలలో అల్ సూర్, అల్ సబాబా, అల్ అకాబ్,  అల్ హీనా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు.  

ఖసబ్ మునిసిపాలిటీ ప్రభావిత ప్రాంతాలలో ప్రధాన రోడ్లు ప్రభావితం అయ్యాయి.  వాటిని యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. అల్ బటినా సౌత్ గవర్నరేట్‌లోని అనేక విలాయత్‌లలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసాయని అధికారులు తెలిపారు. అల్ రుస్తాక్‌లోని విలాయత్ మధ్యలో అలాగే ఫలాజ్ అల్ షరా, హజేర్ బని ఒమర్, వాడి బని అవ్ఫ్, వాడి బని గఫిర్ గ్రామాలలో వర్షం కురిసింది. అల్ అవాబి విలాయత్ ఫలాజ్ బని ఖాజిర్, అల్ సాహెల్, తహ్హబ్ గ్రామాలలో భారీ వర్షాలకు వాడీలు పొంగిపొర్లాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com