యునైటెడ్ కింగ్‌డమ్‌ లో బహ్రెయిన్ పార్లమెంటరీ టీమ్ పర్యటన..!!

- June 08, 2025 , by Maagulf
యునైటెడ్ కింగ్‌డమ్‌ లో బహ్రెయిన్ పార్లమెంటరీ టీమ్ పర్యటన..!!

మనామా: బహ్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ అహ్మద్ బిన్ సల్మాన్ అల్-ముసల్లం యునైటెడ్ కింగ్‌డమ్‌ లో అధికారిక పర్యటనను ముగించారు. రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సహకారం, భాగస్వామ్య పురోగతి కొత్త శకానికి ఈ పర్యటన నాంది పలుకుతుందని తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ సర్ లిండ్సే హోయల్ ఆహ్వానం మేరకు బహ్రెయిన్ టీమ్ పర్యటింది. 

పార్లమెంటరీ, రాజకీయ, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వ్యూహాత్మక సమావేశాలు, చర్చలలో పాల్గొంది. ఈ పర్యటన సందర్భంగా  అల్-ముసల్లం, సర్ లిండ్సే హోయల్ మధ్య కీలకమైన సమావేశం జరిగింది.  ఈ సమయంలో రెండు పార్టీలు ద్వైపాక్షిక పార్లమెంటరీ భాగస్వామ్యం కొత్త దశను ప్రారంభించడానికి అంగీకరించాయి.  

ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల కోసం స్పీకర్ లండన్ నగర లార్డ్ మేయర్ ఆల్డెర్మాన్ అలస్టెయిర్ కింగ్‌తో కూడా చర్చలు జరిపారు. ఈ సమావేశం బహ్రెయిన్ - బ్రిటిష్ సంస్థల మధ్య ఆర్థిక సహకారం, పెట్టుబడి అవకాశాలను పెంచడంపై ఫోకస్ చేశారు.  ప్రతినిధి బృందం  యూకే పార్లమెంట్ ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌తో సమావేశమైంది. ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై చర్చించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com