కేటీఆర్ కూకట్‌పల్లిలో అర్థరాత్రి తనిఖీలు..
- July 12, 2016
రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూకట్‌పల్లిలో అర్థరాత్రి తనిఖీలు చేశారు. రాత్రి 11 గం. నుంచి 2 గంటల సమయంలో ఆయన పర్యటించారు. కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో వాన నీరు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషా ముళ్లపూడి ప్రాంతంలోని రోడ్ల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. రహదారులు, ఫుట్‌పాత్‌ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగుబోతుల వీరంగానికి మృతిచెందిన పాప రమ్య ప్రమాదానికి గురైన స్థలాన్నికేటీఆర్ పరిశీలించారు. వర్షా కాలంలో రోడ్లు నరకంలా మారుతున్నాయని, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తగ్గించాలని ఆయన సూచించారు. పనులు సకాలంలో పూర్తిచేయకపోతే తగిన చర్చలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. నగరంలో తరచూ కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వదలి ప్రజల మంచి కోసం తోడ్పాటు కావాలని కేటీఆర్ కోరారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







