ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో...
- July 12, 2016
బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఒంటెల బలిదానాన్ని ఏ శాఖ అనుమతితో జరుపుతున్నారని ప్రశ్నిస్తూ మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది. వన్యప్రాణుల సంక్షేమ సంఘం నేతృత్వంలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ విషయమై దాఖలు చేసిన పలు ప్రజాహిత వాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కిషన్‌కౌల్, ఆర్.మహదేవన మంగళవారం విచారణ జరిపారు. బక్రీద్ పండుగ సందర్బంగా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఏ రాజస్థాన్ నుండో తీసుకువచ్చిన ఒంటెలను కబేళాలకు తీసుకెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే నరికి చంపుతున్నారని, ఇటు కార్పొరేషన్ అధికారుల అనుమతిని గానీ, ఒంటెలను తరలించేందుకు కేంద్రప్రభుత్వ అనుమతిని గానీ తీసుకోవటమే లేదని పిటీషనర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు.. తమకు తెలిసినంతవరకూ యేళ్లతరబడి ఆ ఒంటెలను చట్ట వ్యతిరేకంగానే తరలిస్తున్నట్లుందని, ఈ విషయమై తగు సంజాయిషీ ఇవ్వాలని కేంద్రప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. తగు వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. ఆ సందర్భంగా న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''ఒంటెలను నరికేందుకు చట్ట ప్రకా రం అనుమతినిస్తున్నారా? ఒంటెలను నరికేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయా? తమిళనాట ఒంటెలు లేవు కనుక ఇతర ప్రాంతాల నుండా వాటిని ఎవరి అనుమతితో తరలిస్తున్నారు? చెన్నై సిటీ మునిసిపల్ చట్టం ప్రకారం నగర కమిషనర్‌కు ఒంటెలను నరికేందుకు అనుమతి ఇచ్చే అధికారం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి'' అని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







